కనిగిరి: పామూరు మండలం డివి పల్లి అంగన్వాడి కేంద్రంలో పోషిత భారత్- జింక్ ఫుడ్ రహిత సమాజంపై అవగాహన కార్యక్రమం
పామూరు మండలం డివి పల్లి అంగన్వాడీ కేంద్రంలో 8వ పోషణ పక్వాడ పక్షోత్సవాల సందర్భంగా పోషిత భారత్-జింక్ ఫుడ్ రహిత సమాజంపై అవగాహన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్ పార్వతి మాట్లాడుతూ... జింక్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. చిన్నపిల్లలు, గర్భవతులు, బాలింతలు జింక్ ఫుడ్ జోలికి ఎట్టి పరిస్థితుల్లో వెళ్లవద్దన్నారు. అంగన్వాడీ కేంద్రంలో అందించే పౌష్టికాహారాన్ని వినియోగించాలని, పోషక విలువలు కలిగిన ఆహారాన్ని తీసుకోవాలని సూచించారు.