కనిగిరి: చంద్రశేఖరపురం మండలం చెర్లోపల్లిలో విద్యుత్ షాక్ తగిలి పుల్లయ్య అనే లైన్మెన్ కు తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
చంద్రశేఖరపురం: విద్యుత్ షాక్ తగిలి లైన్మెన్ కు తీవ్ర గాయాలైన సంఘటన చంద్రశేఖరపురం మండలం చెర్లోపల్లిలో శనివారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చెర్లోపల్లిలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కు మరమ్మతులు చేస్తున్న క్రమంలో విద్యుత్ షాక్ తగిలి లైన్మెన్ పుల్లయ్యకు తీవ్ర గాయాలు అయ్యాయి. పుల్లయ్య కు స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రధమ చికిత్సను అందించి, మెరుగైన చికిత్స కోసం కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.