కనిగిరి: ప్రతి ఒక్కరూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: వెలిగండ్ల ఎంపీడీవో గంగాధర్
వెలిగండ్ల మండలంలోని మొగుళ్ళూరు లో పరిసరాల పరిశుభ్రతపై స్థానిక ప్రజలకు గురువారం ఎంపీడీవో గంగాధర్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ఇళ్లను ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో పరిసరాలను కూడా అంతే పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే సీజనల్ వ్యాధులు ప్రబలుతాయన్నారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ పడవేయవద్దని, ఇళ్ల వద్దకు వచ్చే పారిశుద్ధ్య కార్మికులకు తడి చెత్త, పొడి చెత్త ను వేరుచేసి అందించాలని సూచించారు. పంచాయతీ సిబ్బంది కూడా సేకరించిన చెత్తను చెత్త సంపద కేంద్రాలకు తరలించాలని ఎంపీడీవో ఆదేశించారు.