కనిగిరి: పామూరు మండలం వెంకటాపురం గ్రామంలో వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
పామూరు మండలం వెంకటాపురం గ్రామంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితుల ఆధ్వర్యంలో గురువారం వైభవంగా నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణం మహోత్సవాన్ని తిలకించేందుకు వెంకటాపురం గ్రామం నుండే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి ఆ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి కల్యాణాన్ని కనులారా తిలకించిన భక్తులు... స్వామికి పూజలు చేశారు. భక్తులకు పండితులు తీర్థప్రసాదాలు పంపిణీ చేయగా, ఆలయ కమిటీ నిర్వాహకులు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.