రాయదుర్గం: పట్టణంలో లారీ డీకొని ద్విచక్ర వాహనదారుడి తీవ్ర గాయాలు, సిసి పుటేజ్
రాయదుర్గం పట్టణంలోని బళ్ళారి రోడ్డులో శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. బళ్ళారి వైపు వెళ్తున్న లారీ పట్టణంలోకి వస్తున్న ద్విచక్ర వాహనదారుడి తలకు తగలడంతో అతను అక్కడిక్కడే కుప్పకూలి పడిపోయాడు. ఈ దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. గాయపడిన వ్యక్తిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఇటీవల కాలంలో బళ్ళారి రోడ్డులో ట్రాఫిక్ రద్దీ పెరిగి తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని పట్టణవాసులు ఆందోళన చెందుతున్నారు. పోలీసు అధికారులు ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.