సంతనూతలపాడు: శిధిలావస్థకు చేరిన చీమకుర్తిలోని కె.వి పాలెం రహదారి వంతెన, వంతెన భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్న వాహనదారులు
చీమకుర్తి పట్టణంలోని కె.వి పాలెం కు వెళ్లు రహదారి వంతెన శిథిలావస్థకు చేరింది. వంతెనకు ఇరువైపులా ఉన్న రైలింగ్ గోడలు దెబ్బతిన్నాయి. వంతెన నిర్మించి 40 ఏళ్లకు పైగా గడిచిపోవడంతో వంతెన పూర్తిస్థాయిలో శిథిలావస్థకు చేరింది. దీంతో వంతెన భద్రతపై వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వంతెన పైనుంచి భారీ గ్రానైట్ వాహనాలు నిత్యం వెళుతూ ఉండడంతో వంతెన ఎప్పుడు కూలుతుందోనని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నూతన వంతెన నిర్మించాలని కోరుతున్నారు.