మార్కాపురం జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియపై ఎస్పీ పంకజ్ కుమార్ మీనా కీలక ఆదేశాలు జారీ చేశారు. కేంద్రాల వద్ద ర్యాలీలు, ఊరేగింపులకు అనుమతి లేదని, 30 పోలీస్ యాక్ట్ మరియు BNSS సెక్షన్ 163 అమల్లో ఉన్నాయని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.