ఉరవకొండ: చదువుతోపాటు క్రియల్లోనూ రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు విద్యార్థుల సొంతం : గుత్తి డివైఈఓ లక్ష్మన్న
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని జడ్ పి హెచ్ పాఠశాల విద్యార్థులు 2025-26 వ సంవత్సరం స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొన్న రాజశేఖర్ అండర్-17 బేస్బాల్, భరత్ అండర్-19 బేస్బాల్, హరి సాత్విక్ అండర్-14 సాఫ్ట్బాల్, భార్గవ్ రావు అండర్-14 బేస్బాల్ పాల్గొన్న క్రీడాకారులకు గురువారం శ్రీ లక్ష్మన్న DYEO గుత్తి మరియు శ్రీ మల్లారెడ్డి రిటైర్డ్ DYEO, శ్రీ గోవిందరాజులు MEO1,శ్రీ హరికృష్ణ MEO2, శ్రీ వెంకట ప్రసాద్ ప్రధానోపాధ్యాయులు, శ్రీ రుద్రయ్య పాఠశాల యాజమాన్య కమిటీ చైర్మన్ వీరి చేతుల మీదుగా రాష్ట్రస్థాయిలో పాల్గొన్న సర్టిఫికెట్లను క్రీడాకారులకు అందజేశారు.