ఇందల్వాయి: ఇంధల్వాయిలో ఘనంగా వన్యప్రాణి సప్తాహ వారోత్సవాలు: బైక్ ర్యాలీతో అవగాహన
నిజామాబాద్ జిల్లా ఇంధల్వాయిలో 72వ వన్యప్రాణి సప్తాహ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఫారెస్ట్ అధికారులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 8 వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయని ఎఫ్ఆర్ఓ రవి మోహన్ భట్ తెలిపారు.