ఇందల్వాయి: ఇందల్వాయిలో ఘోర రోడ్డు ప్రమాదం: డీసీఎం డ్రైవర్ మృతి
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయన్పల్లి వద్ద లారీ, డీసీఎం ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. క్లీనర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతుడు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు.