కనిగిరి: పట్టణంలోని ఇందిరా కాలనీలో అగ్నిప్రమాదం, సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసిన అగ్నిమాపక సిబ్బంది
కనిగిరి పట్టణంలోని ఇందిరా కాలనీలో సోమవారం అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. కాలనీలో పెద్ద ఎత్తున పేరుకుపోయిన చెత్తకు ప్రమాదవశాత్తు నిప్పు అంటుకోవడంతో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భయాందోళనకు గురైన స్థానికులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు పరిసరాలలోని ఇళ్లకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకువచ్చారు. దీంతో ప్రమాదం తప్పింది.