కనిగిరి: వెలిగండ్ల జడ్పీ ఉన్నత పాఠశాలలో జనగణన పై సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు కు శిక్షణ ఇచ్చినా వెలిగండ్ల తహసిల్దార్ వాసు
వెలిగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జనగణన పై సూపర్వైజర్లు ,ఎన్యుమరేటర్లు కు వెలిగండ్ల తహసిల్దార్ వాసు గురువారం శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనాభా లెక్కల సేకరణ కార్యక్రమాన్ని పక్కాగా చేపట్టాలని సూచించారు.. జనాభా లెక్కల సేకరణలో భాగంగా ఎన్యుమరేటర్లు ఇంటింటికి, కుటుంబాల స్థితిగతులు, కుటుంబంలో నివసించే జనాభా లెక్కలను పక్కాగా సేకరించాలని సూచించారు. తప్పులు లేకుండా, పారదర్శకంగా జనాభా లెక్కలను సేకరించవలసి ఉంటుందన్నారు.