కనిగిరి: కొండ బోయినపల్లి వద్ద రోడ్డు ప్రమాదం, వ్యక్తికి తీవ్ర గాయాలు
చంద్రశేఖరపురం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలను సంఘటన చంద్రశేఖరపురం మండలం కొండబోయినపల్లి వద్ద శుక్రవారం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చంద్రశేఖరపురం మండలం ఉప్పలపాడుకు చెందిన నాయబ్ రసూల్ మోటర్ బైక్ పై డీజీ పేటకు వెళుతుండగా కొండబోయినపల్లి వద్ద గేదె అడ్డు రావడంతో బైక్ అదుపుతప్పి కింద పడిపోయింది .ఈ ప్రమాదంలో నాయబ్ రసూల్ కు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు 108 అంబులెన్స్ లో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కు తరలించగా, అక్కడ ప్రథమ చికిత్సను అందించి, మెరుగైన చికిత్స కోసం నాయబ్ రసూల్ ను ఒంగోలుకు తరలించారు