కనిగిరి: కలగట్లలో ఫుడ్ పాయిజన్ వల్ల ఆరేళ్ల చిన్నారి బిందు శ్రీ మృతి
కనిగిరి: ఫుడ్ పాయిజన్ వల్ల చిన్నారి మృతి చెందిన సంఘటన కనిగిరి మండలం కలగట్ల గ్రామంలో శుక్రవారం వెలుగు చూసింది. కలగట్ల గ్రామానికి చెందిన ఆరేళ్ల చిన్నారి బిందు శ్రీ గురువారం బిస్కెట్లు తిని తీవ్రమైన వాంతులతో అస్వస్థతకు గురైంది. వెంటనే చిన్నారి తల్లిదండ్రులు వైద్యశాలకు తరలించగా ,పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పడంతో, మెరుగైన చికిత్స కోసం అంబులెన్స్ లో ఒంగోలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చిన్నారి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నారికి ఆమె పెద్దమ్మ బిస్కెట్లు తినిపించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.