సంతనూతలపాడు: చీమకుర్తిలో మూతపడిన ప్రభుత్వ గ్రంథాలయం
చీమకుర్తి పట్టణంలో ప్రభుత్వ గ్రంథాలయం గత కొంతకాలంగా మూతపడింది. గ్రంథాలయంలో పనిచేస్తున్న గ్రంథ పాలకుడు పదవి విరమణ చేసిన తర్వాత ఆలనా పాలన లేక గ్రంథాలయం మూతపడిందని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. పక్క మండలానికి చెందిన గ్రంథ పాలకుడిని చీమకుర్తి మండల కేంద్రంలోని గ్రంథాలయానికి ఇన్చార్జిగా బాధ్యతలు కేటాయించినప్పటికీ ఆయన గ్రంథాలయానికి వచ్చిన దాఖలాలు లేవని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వం స్పందించి నూతన గ్రంథపాలకుడిని నియమించి, మూతపడ్డ గ్రంథాలయాన్ని తెరిపించాలని కోరుతున్నారు.