కనిగిరి: పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో వైభవంగా లక్ష తమలపాకుల అర్చన కార్యక్రమం
కనిగిరి పట్టణంలో శ్రీ హనుమాన్ జయంతి సందర్భంగా శ్రీ వీరాంజనేయ స్వామి వారి ఆలయంలో లక్ష తమలపాకులఅర్చన కార్యక్రమాన్ని పేద పండితుల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి లక్ష తమలపాకుల అర్చన కార్యక్రమంలో పాల్గొని, స్వామిని దర్శించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ ఏర్పాటు చేసింది. భక్తులకు ఆశీర్వచనాలు అందజేసిన పండితులు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.