ఉరవకొండ: గుండ్లపల్లి గ్రామంలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో కిషోరి వికాసం కార్యక్రమం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల పరిధిలోని గుండ్లపల్లి సచివాలయంలో శుక్రవారం మండల ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి ఆధ్వర్యంలో కిషోరీ వికాసం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. పోషకాహారం, రక్తహీనత రాకుండా పాటించాల్సిన అంశాలపై కార్యక్రమంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ఓ మేరీ. ఎం పి హెచ్ ఓ జాఫర్ భాషా, హెల్త్ అసిస్టెంట్ రామాంజినేయులు. అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, కిశోర బాలికలు పాల్గొన్నారు.