ఉరవకొండ: ప్రైవేటు విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తే అడ్డుకుంటాం - ఏఐఎస్ఎఫ్
విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే నియోజకవర్గ వ్యాప్తంగా ముందస్తు అడ్మిషన్లు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణం లోని స్థానిక సిపిఐ కార్యాలయంలో శుక్రవారం ఏఐఎస్ఎఫ్ ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా సహాయ కార్యదర్శి తగ్గుపర్తి చందు మాట్లాడుతూ ఉరవకొండ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ విద్యాసంస్థలు విచ్చలవిడిగా విద్యాసంవత్సరం ప్రారంభం కాకముందే అన్ని గ్రామాలలో గడప గడపకు తిరుగుతూ ముందస్తు అడ్మిషన్లు నిబంధనలకు విరుద్ధం అని పేర్కొన్నారు.