ఆత్మకూర్: హన్మకొండ: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో అనారోగ్యం, అప్పుల బాధతో నీరు లక్ష్మయ్య (55) అనే వ్యక్తి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తిరుపతి తెలిపారు.