ఆత్మకూరు: వివాహిత మృతి భర్త ఇంటిపై 200మంది బంధువుల దాడి
అమరచింత మండలం నాగల్కడుమూరుకు చెందిన పల్లవి ఈనెల 7న తమిళనాడులో అనుమానాస్పదంగా మృతిచెందింది. గద్వాల మండలం కొండపల్లికి చెందిన పల్లవిని నాగల్ కడుమూరుకు చెందిన శివతో మూడేళ్ల క్రితం పెళ్లిజరిగింది. మృతురాలికి 11నెలల బాబు ఉన్నాడు. గురువారం డెడ్ బాడీ గ్రామానికి చేరుకోగా కొండపల్లి గ్రామం నుంచి దాదాపు 200మంది గ్రామానికి చేరుకోగా పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆత్మకూరు సీఐ శివకుమార్ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మదనపురం, ఆత్మకూరు ఎస్ఐలు పోలీసులతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.