కనిగిరి: విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలి: కట్ట కింద పల్లి లో కనిగిరి ఏఎంసీ చైర్మన్ రమా శ్రీనివాస్
పామూరు మండలం కట్టకింద పల్లిలో కనిగిరి ఏం సి చైర్మన్ రమా శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పిద్దాం... ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేద్దాం అనే నినాదంతో విద్యాశాఖ అధికారులతో కలిసి ఆయన గ్రామంలో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యతోపాటు, యూని ఫారం, ఉచిత పాఠ్యపుస్తకాలతో పాటు మధ్యాహ్న భోజన పథకం అమలవుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తప్పనిసరిగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్చాలని ఆయన సూచించారు.