రాయదుర్గం: యాదవులకు సముచిత స్థానం కల్పించాలి : యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల మనోహర్
జిల్లాలో యాదవ సంఘాన్ని బలోపేతం చేసేందుకు కృషి చేస్తామని అనంతపురం జిల్లా యాదవ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల మనోహర్ ప్రకటించారు. ఆదివారం జిల్లా కేంద్రంలో జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ యాదవ్, జాతీయ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, జిల్లా గౌరవాధ్యక్షుడు నరసింహులు యాదవ్ సమక్షంలో నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఆవుల మనోహర్ ను ఎన్నుకున్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు సీట్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. యాదవ కార్పొరేషన్‌కు నిధులు కేటాయించాలని కోరారు.