కనిగిరి: పెద్ద చెర్లోపల్లి మండలం వెంగళాయపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కనిగిరి పట్టణ సిపిఐ కార్యదర్శి రామారావు మృతి
పెద్ద చెర్లోపల్లి: ఆటో బోల్తా పడి కనిగిరి పట్టణానికి చెందిన సిపిఐ కార్యదర్శి రామారావు మృతి చెందిన సంఘటన పెద్ద చెర్లోపల్లి మండలం వెంగలాయపల్లి వద్ద బుధవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కనిగిరి పట్టణానికి చెందిన సిపిఐ కార్యదర్శి రామారావు ఆటోలో వెళుతున్న క్రమంలో పెద్ద చెర్లోపల్లి మండలం వెంగళాయపల్లి వద్ద ఆటో బోల్తా పడి తీవ్ర గాయాలయ్యాయి. 108 వాహనంలో కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలకు రామారావును తరలించగా, అప్పటికే రామారావు మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. రామారావు ఆకస్మిక మృతి పట్ల సిపిఐ పార్టీ సీనులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు.