సంతనూతలపాడు: చీమకుర్తిలోని శ్రీ కోదండరామ స్వామి ఆలయంలో వైభవంగా శ్రీ కోదండరామ స్వామి వారి పాదుకా పట్టాభిషేక కార్యక్రమం
చీమకుర్తి పట్టణంలో కొలువైన శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో స్వామి వారి పాదుక పట్టాభిషేక కార్యక్రమాన్ని శనివారం వేద పండితుల ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఉంచి పేద పండితులు పాదుకాపట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన భక్తులకు వేద ఆశీర్వచనాలను అందజేసిన పండితులు, స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు.