సంతనూతలపాడు: వేసవిలో ప్రజలకు తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి: సంతనూతలపాడు ఎంపీడీవో సురేష్ బాబు
సంతనూతలపాడు మండలంలోని ఎండ్లూరు గ్రామంలో ఎంపీడీవో సురేష్ బాబు ఆర్డబ్ల్యూఎస్ ఏఈ లతో కలిసి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని మంచినీటి వనరుల కేంద్రాన్ని ఎంపీడీవో పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో అధికారులకు పలు కీలక సూచనలు చేశారు మంచినీటి ట్యాంకులను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా గ్రామంలో ప్రజలకు మంచినీటి ఎద్దడి తలెత్తకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దెబ్బతిన్న పైప్ లైన్లకు మరమ్మతులు చేపట్టి నిరంతరాయంగా తాగునీటి సరఫరా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.