కనిగిరి: నందన మారెళ్ళ వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టి లోయలో పడ్డ టాటా మ్యాజిక్ వాహనం, ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు
కనిగిరి మండలంలోని నందన మారేళ్ళ వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కందుకూరు నుండి ఎర్రగొండపాలెం కు వెళ్తున్న టాటా మ్యాజిక్ వాహనం కనిగిరి మండలం నందన మారేళ్ళ వద్ద అదుపుతప్పి కల్వర్టును ఢీ కొట్టి, లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్ తో పాటు అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఇద్దరినీ స్థానికులు చికిత్స నిమిత్తం కనిగిరి పట్టణంలోని ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు.