సంతనూతలపాడు: చీమకుర్తి నెహ్రు నగర్ లో ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య
చీమకుర్తి: ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన చెమకుర్తి పట్టణంలోని నెహ్రు నగర్ లో సోమవారం వెలుగు చూసింది. అందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. నెహ్రు నగర్ లో నివాసం ఉంటున్న నూకల రాము (26) ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. రాముకు అతని భార్యకు కోర్టు రెండు నెలల క్రితం విడాకులు మందులు చేసింది. అప్పటినుండి రాము తీవ్ర మనస్థాపంతో ఉంటూ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న సిఐ దాసరి ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.