కనిగిరి: పామూరు మండలం కట్టకిందపల్లి లో పేకాట శిబిరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడులు, పేకాట ఆడుతున్న ఐదుగురు అరెస్ట్
పామూరు: పేకాట శిబిరం పై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి ఐదుగురిని అరెస్టు చేసిన సంఘటన పామూరు మండలం కట్టకిందపల్లి గ్రామ శివారులో మంగళవారం చోటు చేసుకుంది. అందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... కట్ట కింద పల్లి గ్రామంలో పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పక్కా సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ సుధాకర్ సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న ఐదుగురిని అరెస్టు చేయడంతో పాటు వారి వద్ద నుండి రూ.10,010 లు నగదు, ఐదు సెల్ ఫోన్లు, నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు.