ఉరవకొండ: శ్రీ వాసవి మాత దేవాలయంలో శ్రీ వాసవి మాతకు అధికమాస ప్రత్యేక పూజలు పారాయణాలు
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వాసవి మాత దేవాలయంలో శ్రీ వాసవి మాతకు అధికమాస సందర్భంగా ఆదివారం మణి ద్వీప వర్ణన తొమ్మిది రోజుల పారాయణం పఠనం, ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు, గత తొమ్మిది రోజుల నుంచి వాసవి మాతకు పారాయణం పటిస్తూ, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు . ఆదివారం చివరి రోజుతో పౌర్ణమి సందర్భంగా అమ్మవారికి లలిత పారాయణం పట్టిస్తూ, మణిద్వీప వర్ణన ఉద్యాపన కార్యక్రమం నిర్వహించి, అమ్మవారికి 33 ఇళ్ల నుంచి 33 రకాల పిండివంటలను తయారుచేసుకుని అమ్మవారి పూజా కార్యక్రమంలో నైవేద్యంగా పెడుతూ ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు.