కనిగిరి: బూత్ లెవెల్ అధికారులతో బిఎల్ఎలు సమన్వయం చేసుకోవాలి: టిడిపి రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి
పామూరు: రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం పట్ల టిడిపి నియమించిన బూతు లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి సూచించారు. పామూరులో మంగళవారం టిడిపి బూత్ లెవెల్ ఏజెంట్లతో ఆయన సమావేశమయ్యారు. ఎన్నికల సంఘం నియమించిన బూత్ లెవెల్ అధికారులతో బిఎల్ఏలు సమన్వయం చేసుకొని పనిచేయాలన్నారు. టిడిపికి సంబంధించిన ఏ ఒక్క ఓటు కూడా తొలగింపుకు గురి కాకుండా చూసుకోవాలన్నారు.