రాప్తాడు: హంపాపురం గ్రామంలో కోటి రూపాయలతో నూతనంగా నిర్మించిన రోడ్డును ప్రారంభించిన రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత
అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఐదు గంటల 20 నిమిషాల సమయంలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత హంపాపురం చిగిచెర్ల లింక్ రోడ్డును ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత మాట్లాడుతూ హంపాపురం చిగిచెర్ల అనంతపురం వెళ్ళేందుకు ఉపయోగపడే లింకు రోడ్డును కోటి రూపాయలతో నూతనంగా రోడ్డు వేయించడం జరిగిందని అదేవిధంగా ఆంజనేయస్వామి దేవస్థానం వరకు బిటి రోడ్డును కూడా 33 లక్షల రూపాయలతో చేపట్టడం జరిగిందని వీటిని ఈరోజు ప్రారంభిస్తున్నామని భవిష్యత్తులో అన్ని రోడ్లు నిర్మించేందుకు ప్రభుత్వ సహకారం తీసుకుంటామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు.