కనిగిరి: ప్రశ్న రావణ్ పై ప్రభుత్వం పెట్టిన కేసులను ఉపసంహరించుకోవాలి: కనిగిరిలో AIYF జిల్లా కార్యదర్శి పి ప్రభాకర్
కనిగిరి: ప్రముఖ యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై పెట్టిన కేసులను ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని AIYF జిల్లా కార్యదర్శి పి ప్రభాకర్ డిమాండ్ చేశారు. కనిగిరిలోని సిపిఐ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్న జర్నలిస్టులు, యూట్యూబర్లు, సామాజిక మాధ్యమాల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని అక్రమ కేసులు ప్రభుత్వం బనాయిస్తోందన్నారు. ప్రశ్న రావణ్ పై పెట్టిన ఉపా కేసును వెంటనే ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు.