కనిగిరి: ఎమ్మార్పీ ధరల కంటే అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు: కనిగిరి వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్
కనిగిరి మండలంలోని ఉస్తుం వారి పల్లి గ్రామంలో ఎరువుల దుకాణాలను కనిగిరి వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెరువుల దుకాణాలలోని రికార్డులను పరిశీలించి, రికార్డుల ఆధారంగా స్టాక్ ఎంత ఉందో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మార్పీ ధరల కంటే ఎరువుల దుకాణాల యజమానులు అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అధిక ధరలకు ఎరువులను విక్రయిస్తున్నట్లు రైతుల నుండి ఫిర్యాదు అందితే దుకాణాల లైసెన్సులు కూడా రద్దయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.