కనిగిరి: ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా పంటలు పండించేందుకు రైతులు మొగ్గు చూపాలి: కనిగిరి వ్యవసాయ శాఖ ఏడిఏ జైనులాబ్దిన్
కనిగిరి మండలంలోని పునుగోడు గ్రామంలో రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా వివిధ రకాల పంటలు ఎలా పండించాలో వివరించే శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన కనిగిరి వ్యవసాయ శాఖ ఏడిఏ షేక్ జైనులాబ్దిన్ జీవామృతం బీజామృతం ,ద్రవ జీవామృతం ఎలా తయారు చేయాలో ప్రయోగాత్మకంగా చేసి చూపించారు.ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటల వల్ల కలిగే ఉపయోగాలను ఏడిఏ వివరించారు .రసాయనక ఎరువుల వాడకాన్ని తగ్గించి, రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులు ద్వారా పంటలు పండించాలన్నారు.