సంతనూతలపాడు: సేవ్ వాటర్ కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడులో మంచినీటి వనరులను పరిశీలించిన ఒంగోలు డివిజనల్ డిడిఓ సువార్తమ్మ
అసంత నూతలపాడులో జల సురక్ష మిషన్ సేవ్ వాటర్ కార్యక్రమంలో భాగంగా ఒంగోలు డివిజనల్ డిడిఓ సువార్తమ్మ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో కలిసి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని జల వనరులైన మంచినీటి ఓవర్ హెడ్ ట్యాంకులు మరియు బాబులను ఆమె పరిశీలించారు. ఓవర్ హెడ్ ట్యాంకులు, మంచినీటి బాబులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసి క్లోరినేషన్ కార్యక్రమాలు చేపట్టాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. వేసవిలో గ్రామస్తులకు నీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, పైప్ లైన్లకు లీకేజీలు తలెత్తకుండా చూడాలని సూచించారు.