కనిగిరి: ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై క్షేత్రస్థాయిలో వైసీపీ శ్రేణులు పోరాటం చేయాలి: కనిగిరి వైసిపి ఇన్చార్జి నారాయణ యాదవ్
కనిగిరి పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన, వైఫల్యాలపై వైసీపీ కనిగిరి నియోజకవర్గం ఇంచార్జ్ దద్దాల నారాయణ యాదవ్ సోమవారం పార్టీ కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎన్నికల హామీలు, మేనిఫెస్టోలోని వాగ్దానాలను గుర్తిస్తాయిలో అమలు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసింది అన్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై కార్యకర్తలు క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.