కొండపి: టంగుటూరు మండలంలో పేకాట ఆడుతున్న ఐదు మందిని అదుపులోకి తీసుకున్న స్థానిక పోలీసులు, వారిపై కేసు నమోదు
ప్రకాశం జిల్లా టంగుటూరులోని లారీ యూనియన్ ఆఫీస్ వెనుక భాగంగా పేకాట ఆడుతున్న 5 మందిని సోమవారం స్థానిక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పేకాట ఆడుతున్న వారి వద్ద నుంచి రూ.5,900 నగదు తో పాటు 5 మొబైల్ ఫోన్లో స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు చెప్పారు. పేకాట ఆడటం చట్టరీత్య నేరమని పేకాట ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడైనా పేకాట ఆడుతున్నట్లు గుర్తిస్తే 112 నెంబర్కు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.