ఉరవకొండ: బ్రాహ్మణపల్లి తండా సమీపంలో చిరుత దాడిలో మృతి చెందిన మేక
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండా గ్రామానికి చెందిన రైతు గంగా నాయక్ కు చెందిన మేకను శుక్రవారం రాత్రి చిరుత దాడిలో చనిపోయిందని బాధిత రైతు శనివారం వాపోయాడు. గ్రామ సమీపంలోని గడ్డివాము దొడ్డిలో ఉన్న మేకను సమీపంలోని ముళ్ళపొదుల చాటుకు చిరుత ఎత్తుకెళ్లిందని రైతు పేర్కొన్నాడు. అటవీ శాఖ అధికారులు రైతుకు న్యాయం చేయాలని స్థానికులు గ్రామస్తులు కోరుతున్నారు.