ఉరవకొండ: ఆర్థికశాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఇచ్చిన మాట మేరకు చిన్నారి లోకేష్ వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం అందించి అండగా నిలిచారు
రాష్ట్ర ఆర్థిక & ప్రణాళిక, వాణిజ్య పన్నులు మరియు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. ఉరవకొండ పట్టణానికి చెందిన హనుమంతు కుమారుడు, ఆరు నెలల చిన్నారి కుమ్మరి లోకేష్ అరుదైన ప్రైమరీ హీమోఫాగోసైటిక్ లింఫోహిస్టియోసిస్ (HLH) వ్యాధితో బాధపడుతుండగా, చిన్నారి కుమ్మరి లోకేష్ చికిత్స కోసం ఇటీవల, కొద్దిరోజుల క్రితం చిన్నారి తల్లిదండ్రులు మంత్రిని కలిసి ఆర్థిక సహాయం కోరింది. కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న మంత్రి, తక్షణమే స్పందించి ఐదు రోజుల క్రితం సీఎంఆర్‌ఎఫ్ ద్వారా సహాయం అందిస్తానని హామీ మేరకు రూ 7.5 లక్షల చెక్కును మంత్రి బుధవారం అందించారు.