ఉరవకొండ: చత్రప్రభ అలంకరణలు దర్శనమిచ్చిన అవధూత సద్గురు శ్రీ ఎర్రితాత స్వామి. ఆరాధన ఉత్సవాలకు వేల సంఖ్యలో తరలివచ్చిన భక్త జనం
అనంతపురం జిల్లా బెలుగుప్ప మండల కేంద్రంలోని శాంతి ధామంలో అవధూత సద్గురు శ్రీ ఎర్రితాత స్వామి వారి 90వ ఆరాధన ఉత్సవాల్లో చివరి రోజు అయిన గురువారం స్వామి వారు చత్రప్రభ అలంకరణలో భక్తులకు దర్శనం ఇచ్చారు. గత మూడు రోజులుగా ఆధ్యాత్మిక క్షేత్రం శాంతి దామంలో ఎర్రితాత ఆరాధన ఉత్సవాలు కన్నుల పండువగా జరిగాయి. ఉత్సవాలకు తరలివచ్చిన భక్తజనానికి బెలుగుప్ప ఉన్నత పాఠశాలలో 1988-89 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల బృందం కలిసి అన్నదాన సంతర్పణ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఆలయం వద్ద ఆలయ సేవా కమిటీ సభ్యులతో కలిసి నిర్వహించారు. ఆరాధన ఉత్సవాల్లో స్వామివారి దర్శనానికి వేల సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు.