ప్రకాశం జిల్లా పొదిలి మండలం మల్లవరం వద్ద ఆటో బోల్తా పడటంతో 8 మందికి గాయాలయ్యాయి. రాజంపల్లి నుంచి పొదిలికి వస్తుండగా జరిగిన ఈ ప్రమాదంలో, ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం ఒంగోలుకు తరలించారు. మిగిలిన వారికి పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.