సంతనూతలపాడు: చీమకుర్తి పట్టణంలో శ్రీ రామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ధ్యాన శిక్షణ తరగతులు ప్రారంభం
చీమకుర్తి పట్టణంలో శ్రీరామచంద్ర మిషన్ ఆధ్వర్యంలో ఉచితంగా ధ్యాన శిక్షణ తరగతులను ప్రారంభించారు. ధ్యాన శిక్షణ తరగతులకు వచ్చిన స్థానిక ప్రజలతో రామచంద్ర మిషన్ ప్రతినిధులు మాట్లాడుతూ... ధ్యానం ద్వారా మానసిక, శారీరక ఒత్తిడి లను అధిగమించవచ్చన్నారు. ధ్యానం చేయడం ద్వారా దీర్ఘకాలిక రుగ్మతలు కూడా తగ్గిపోతాయని సూచించారు. ప్రతి ఒక్కరూ నిత్యం ధ్యానం చేయడాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు.