సంతనూతలపాడు: ఉప్పుగుండూరులో పర్యావరణ పరిరక్షణ పై విద్యార్థులకు అవగాహన
నాగులుప్పలపాడు మండలం ఉప్పుగుండూరు ప్రభుత్వ గ్రంథాలయంలో వేసవి శిక్షణ శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంథ పాలకురాలు ధనమ్మ విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. వాడి పడవేసిన కొబ్బరి బొండాలను మొక్కలు నాటే కుండీలుగా వినియోగించుకోవచ్చని విద్యార్థులకు సూచించారు. కొబ్బరి బోండాలలో మొక్కలు ఎలా నాటవచ్చునో ప్రయోగాత్మకంగా విద్యార్థుల చేత చేసి చూపించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు ఉరివిగా మొక్కలు నాటాలని ఆమె సూచించారు.