ఉరవకొండ: పట్టణ ప్రజల ఇంటి స్థలాల కొరకు రెవెన్యూ అధికారులతో రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రివర్యులు పయ్యావుల కేశవ్ సమీక్ష
అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణ ప్రజల ఇంటి స్థలాల కొరకు రెవెన్యూ అధికారులతో అనంతపురంలోని రామ్ నగర్ లో ఉన్న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ఉరవకొండ ప్రజల ఇంటి స్థలాల కొరకు ఉరవకొండ తహసీల్దార్ రెవెన్యూ, పంచాయతీ అధికారులతో రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక మరియు వాణిజ్య పన్నులు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు పయ్యావుల కేశవ్ సమీక్ష నిర్వహించారు. ఉరవకొండ పట్టణ ప్రాంతంలో అనువైన వివిధ ప్రాంతాల స్థలాలను సర్వే నిర్వహించి ఇళ్ల పట్టాల కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించి మ్యాపును మంత్రివర్యులు పరిశీలించారు.