కనిగిరి: పట్టణంలో గుర్తుతెలియని యువకుడి మృతదేహం లభ్యం, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న పోలీసులు
కనిగిరి పట్టణంలోని చింతలపాలెం నుండి మోడల్ స్కూల్ కు వెళ్ళు రహదారిలో ఉన్న క్వారీల సమీపంలో ఆదివారం గుర్తుతెలియని మృతదేహం వెలుగు చూసింది. అతను చనిపోయి 2,3, రోజులు అయి ఉంటుందని, మృతదేహం కుళ్ళిపోయి, దుర్వాసన వెదజల్లుతూ ఉందని స్థానికులు అంటున్నారు.కూల్ డ్రింకులో పురుగుల మందు కలుపుకొని తాగి మృతి చెందినట్లు భావిస్తున్నారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.