రాజేంద్రనగర్: చింతల్ పేట గ్రామం మాజీ సర్పంచ్ కాల శ్రీనివాస్ గుండెపోటుతో మృతి
చేవెళ్ల నియోజకవర్గం నవాబ్పేట మండలం, చింతల్ పేట గ్రామ మాజీ సర్పంచ్ కాలే శ్రీనివాస్ గుండెపోటుతో మరణించారు. చిన్న వయసులోనే మాజీ సర్పంచ్ మరణించడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు నాయకులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. రేపు గ్రామంలో అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.