నేలకొండపల్లి: నేలకొండపల్లిలో కలకలం: ఎవర్గ్రీన్ స్కూల్ సమీపంలో భారీ కొండచిలువ
నేలకొండపల్లి 6వ వార్డు ఎవర్గ్రీన్ స్కూల్ సమీపంలో కనిపించిన కొండచిలువతో స్థానికులు ఆందోళన చెందారు. సమాచారం అందుకున్న సర్పంచ్, వార్డు సభ్యులు మరియు ఫైర్ సిబ్బంది వెంటనే స్పందించి కొండచిలువను పట్టుకుని హతమార్చారు. జనావాసాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని గ్రామస్తులు కోరుతున్నారు.