కనిగిరి: బొట్ల గూడూరులో మహానాడు ఏర్పాట్లను పరిశీలించిన టిడిపి రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ చౌదరి
పామూరు మండలం బోట్ల గూడూరులో ఈనెల 27, 28 తేదీల్లో నిర్వహించనున్న టిడిపి మహానాడు కార్యక్రమంలో ఏర్పాట్లను తెలుగుదేశం పార్టీ రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల ప్రధాన కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి ఆదివారం పరిశీలించారు. బట్లగూడూరు ప్రధాన రహదారికి సమీపంలో ఉన్న మైదానాన్ని ఆయన పరిశీలించి, మహానాడు కార్యక్రమానికి అనుగుణంగా మైదానాన్ని జెసిబి యంత్రాలతో శుభ్రం చేయాలని స్థానిక టిడిపి నాయకులను ఆదేశించారు. అదేవిధంగా కార్యక్రమానికి పామూరు మండలం నుంచి వచ్చే టిడిపి నాయకులు, కార్యకర్తలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేయాలన్నారు.