కనిగిరి: వెలిగండ్లలో వైభవంగా శ్రీ నాగర్పమ్మ తల్లి కొలుపుల కార్యక్రమం, పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు
వెలిగండ్లలో కొలువైన శ్రీ నాగర్పమ్మ తల్లి కొలుపుల కార్యక్రమాన్ని ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో మంగళవారం వైభవంగా నిర్వహించారు. కొలుపుల కార్యక్రమంలో భాగంగా వెలిగండ్ల మండల కేంద్రంలోని ప్రధాన వీధుల్లో బొల్లావుల ఊరేగింపు కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. మహిళలు పవిత్ర గంగాజలాలతో ప్రదర్శన చేపట్టి అమ్మవారిని అభిషేకించి, పూజలు చేశారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పొంగళ్ళు పెట్టి మొక్కుబడులను తీర్చుకున్నారు.