కనిగిరి: సీఎం చంద్రబాబు పాలనలో రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి: కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి
కనిగిరి పట్టణంలో సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా ఒంగోలు పార్లమెంట్ టిడిపి అధ్యక్షులు, కనిగిరి శాసనసభ్యులు డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి అన్న క్యాంటీన్ మరియు ప్రభుత్వ వైద్యశాలలో రోగులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా స్వయంగా ఎమ్మెల్యే వారికి అన్నం వడ్డించారు. అనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ... సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టామని, అమరావతి సృష్టికర్త, వెలుగొండ ప్రాజెక్ట్ నిర్మాత సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే వివరించారు.